Hyderabad: టూరిస్ట్ బస్సులపై ‘ఒకే రాష్ట్రం-ఒకే పన్ను’ దిశగా అడుగులు

Hyderabad: హైదరాబాద్‌లో టూరిస్ట్ బస్సు యజమానులతో రవాణా శాఖ కమిషనర్ ఇళంబరితి సమావేశం. త్రైమాసిక పన్ను హేతుబద్ధీకరణ, "ఒక రాష్ట్రం-ఒకే పన్ను" విధానంపై చర్చ.

G. Rama Krishna, Hyderabad
Published on: 31 July 2026 6:20 PM IST
Hyderabad
X

Hyderabad: టూరిస్ట్ బస్సులపై ‘ఒకే రాష్ట్రం-ఒకే పన్ను’ దిశగా అడుగులు

హైదరాబాద్: తెలంగాణ రవాణా శాఖ కమిషనర్ శ్రీ ఇళంబరితి, IAS, అదనపు రవాణా కమిషనర్ శ్రీ రమేష్, మరియు జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్) శ్రీ చంద్రశేఖర్ గౌడ్ లతో కలిసి, నేడు టూరిస్ట్ బస్సు యజమానులతో టూరిస్ట్ బస్సులపై త్రైమాసిక పన్ను విధానాన్ని హేతుబద్ధీకరించే అంశంపై సమావేశం నిర్వహించారు.

ప్రస్తుతం టూరిస్ట్ బస్సులపై సింగిల్ డిస్ట్రిక్ట్ ట్యాక్స్, టూ డిస్ట్రిక్ట్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ అనే మూడు వేర్వేరు స్లాబుల ద్వారా పన్ను విధిస్తున్నారు. ఈ నిర్మాణాన్ని సరళీకరించేందుకు మరియు హేతుబద్దీకరించేందుకు ఆపరేటర్లపై మొత్తం పన్ను భారం పెంచకుండానే ఈ మూడు స్లాబులను తొలగించి "ఒక రాష్ట్రం, ఒకే పన్ను" విధానం వైపు వెళ్లడం అవసరమని భావించారు.

ఈ అంశంపై అధ్యయనం చేయడానికి గతంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ అంశం పై టూరిస్ట్ బస్సు ఆపరేటర్ల అభిప్రాయాలు, సూచనలు తీసుకునేందుకు నేటి సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా టూరిస్ట్ బస్సు ఆపరేటర్లు ఈ సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను తెలియజేశారు.

G. Rama Krishna, Hyderabad

G. Rama Krishna, Hyderabad

Next Story