Hyderabad: జేఏసీల ముసుగులో ఎక్సైజ్ అధికారులను టార్గెట్ చేయడం సరికాదు టీజీవో!

Hyderabad: నాంపల్లి టీజీవో భవన్‌లో సమావేశం. జేఏసీ ముసుగులో ఎక్సైజ్ ఉన్నతాధికారులను టార్గెట్ చేయడం సరికాదని ఏలూరి శ్రీనివాస్, లక్ష్మణ్ గౌడ్ తీవ్ర ఆగ్రహం.

GIRI, CENTRAL ZONE
Published on: 1 Oct 2026 5:13 PM IST
Hyderabad
X

Hyderabad: జేఏసీల ముసుగులో ఎక్సైజ్ అధికారులను టార్గెట్ చేయడం సరికాదు టీజీవో!

Hyderabad: ఎక్సైజ్‌ శాఖ క్రమశిక్షణతో పనిచేసే యూనిఫామ్‌ సర్వీసు అని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్‌ అన్నారు. నాంపల్లిలోని టీజీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు జేఏసీల ముసుగులో ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని బెదిరించడం సరికాదన్నారు.

మంత్రులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, ఐఏఎస్‌ అధికారులను టార్గెట్‌ చేయడం, ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని బెదిరింపులకు పాల్పడటాన్ని ఖండించారు. గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘంగా అధికారులపై వ్యక్తిగత విమర్శలను సహించబోమన్నారు. పరిపాలనా వ్యవహారాల్లో జేఏసీల పేరుతో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. ఎక్సైజ్‌ కమిషనర్‌పై కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఎక్సైజ్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్‌ గౌడ్‌ అన్నారు.

రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే ప్రధాన శాఖల్లో ఎక్సైజ్‌ ఒకటని తెలిపారు. బదిలీల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. నిరాధార ఆరోపణలతో ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయవద్దని కోరారు. ఎక్సైజ్ శాఖలో బదిలీలు లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కమిషనర్‌పై ఒత్తిడి తీసుకువచ్చి బదిలీలు చేయించామని చెప్పారు. అలాంటి కమిషనర్ పై అవినీతి ఆరోపాలను చేయడం సరికాదన్నారు. తక్షణమే కమీషనర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు.

GIRI, CENTRAL ZONE

GIRI, CENTRAL ZONE