Khairatabad: పీఎం-కుసుమ్ సోలార్ టారిఫ్ తగ్గించవద్దు.. రైతుల విజ్ఞప్తి!
Khairatabad: పీఎం-కుసుమ్ పథకంలో సోలార్ విద్యుత్ టారిఫ్‌ను రూ.3.13 నుంచి రూ.2.98కు తగ్గించవద్దని టీజీఈఆర్సీని డిమాండ్ చేసిన తెలంగాణ పీఎం-కుసుమ్ ఫార్మర్స్ అసోసియేషన్.
Khairatabad: పీఎం-కుసుమ్ సోలార్ టారిఫ్ తగ్గించవద్దు.. రైతుల విజ్ఞప్తి!
ఖైరతాబాద్: పీఎం-కుసుమ్ కాంపోనెంట్-ఏ పథకంలో యూనిట్‌కు టీజీఈఆర్సీ ఆమోదించిన రూ.3.13 టారిఫ్‌ను రూ.2.98కు తగ్గించవద్దని తెలంగాణ పీఎం-కుసుమ్ ఫార్మర్స్ అసోసియేషన్ (TGPMKFA) డిమాండ్ చేసింది.
ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ లో జరిగిన సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 మంది రైతులు పాల్గొని టారిఫ్ తగ్గింపు తమపై తీవ్ర ఆర్థిక భారం మోపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
జీఎస్టీ తగ్గింపుతో పాటు సోలార్ పరికరాలు, స్టీల్, అల్యూమినియం, కార్మిక వ్యయం, రవాణా, ఫైనాన్స్ ఖర్చులు భారీగా పెరిగిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. వాస్తవ ప్రాజెక్టు వ్యయాలపై సమగ్ర అధ్యయనం చేసి, అవసరమైతే టారిఫ్‌ను పెంచాలని టీజీఈఆర్సీని విజ్ఞప్తి చేశారు.
Next Story




