Thalakondapally: తిరుమణి రవి గౌడ్‌కు బీజేపీ కార్యకర్తల ఘన సన్మానం!
Thalakondapally: తలకొండపల్లి బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు తిరుమణి రవి గౌడ్‌కు ఘన సన్మానం: ఆరేళ్ల నిస్వార్థ సేవలను కొనియాడిన 150 మంది కార్యకర్తలు, శాలువాతో ఘనంగా సత్కారం.
c: తిరుమణి రవి గౌడ్‌కు బీజేపీ కార్యకర్తల ఘన సన్మానం!
తలకొండపల్లి: తలకొండపల్లి మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు తిరుమణి రవి గౌడ్‌కు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 150 మంది బీజేపీ కార్యకర్తలు ఘనంగా సన్మానం చేశారు. గత ఆరు సంవత్సరాలుగా మండల అధ్యక్షుడిగా ఆయన పార్టీకి అందించిన సేవలను కార్యకర్తలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
రవి గౌడ్ పార్టీ కోసం పనిచేసే సమయంలో నీతి, ధర్మం, నిబద్ధతకు ప్రాధాన్యతనిస్తూ, కార్యకర్తల పట్ల ఆప్యాయతతో వ్యవహరించారని పలువురు కార్యకర్తలు పేర్కొన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో పార్టీ కార్యకర్తలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ అందరికీ అందుబాటులో ఉండేవారని గుర్తు చేసుకున్నారు.
ఆరు సంవత్సరాల పాటు మండల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినప్పటికీ ఏనాడూ గర్వం, అహంకారం ప్రదర్శించకుండా సాధారణ కార్యకర్తలతో కలిసిమెలిసి పనిచేయడం ఆయన ప్రత్యేకతగా కార్యకర్తలు పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం గ్రామస్థాయి నుంచి కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ బీజేపీని మండలంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేసిన విధానాన్ని వారు గుర్తు చేసుకున్నారు.
రవి గౌడ్ నాయకత్వంలో పార్టీ కార్యక్రమాలను గ్రామగ్రామాన విస్తరించడంలో కార్యకర్తలు కీలకంగా పనిచేశారని, కార్యకర్తల కష్టసుఖాల్లో అండగా నిలిచిన ఆయన సేవలను ఎప్పటికీ మరువలేమని పలువురు అన్నారు. అనంతరం రవి గౌడ్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు పాండు సర్పంచ్ మహేష్ మైనార్టీ నాయకులు ఆరిఫ్ శేఖర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సుదర్శన్ యాదగిరి తలకొండపల్లి మండలంలోని వివిధ గ్రామాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.




