Thalakondapally: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిసిన కాసు శ్రీనివాస్ రెడ్డి!
Thalakondapally: విజయదశమి సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని తలకొండపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
Thalakondapally: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిసిన కాసు శ్రీనివాస్ రెడ్డి!
Thalakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే నివాసానికి వెళ్లిన ఆయన దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కాసు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. విజయదశమి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన ఆశలు, ఆనందాలు, విజయాలను నింపాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.
ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఈ పర్వదినం సందర్భంగా ఆకాంక్షించారు.




