Thalakondapally: వెల్జాల్లో మిలాద్-ఉన్-నబీ ర్యాలీ మరియు అన్నదానం
Thalakondapally: తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో జామియా మసీదు కమిటీ ఆధ్వర్యంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Thalakondapally: వెల్జాల్లో మిలాద్-ఉన్-నబీ ర్యాలీ మరియు అన్నదానం
తలకొండపల్లి: తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలోని జామి మజీద్ కమిటీ అధ్యక్షులు ఎం.డి. సయిద్ గారి ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జయంతి నీ (మిలాదున్ నబిగా జరుపుకుంటారు) గ్రామంలో ముస్లిం యువకులు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తు మహబు సుభని దర్గాలో పూలు సమర్పించు కొని ఫతేహాలు ఇచ్చారు.
అనంతరం మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మస్జిద్ ఇమామ్ *మహమ్మద్ ఇంతియాజ్ ఖాద్రి * మాట్లాడుతూ ప్రతి ముస్లింలు మహమ్మద్ ప్రవక్త ను గౌరవ బిరుదులతో పలుకుతారు. మహమ్మద్ ప్రవక్త పేరు ఉచ్చరించినప్పుడు గాని రాసినప్పుడు గాని తర్వాత గౌరవ బిరుదులతో పలుకుతారు , మొహమ్మద్ ప్రవక్త పేరు ఉచ్చరించినప్పుడు తర్వాత సల్లల్లాహు అలైహి వసల్లం అని పలకాలి ,అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అజీజ్, ఆరిఫ్, రషీద్, సుభాన్, నయుం, ఖాజమైనుద్దీన్, గౌస్, ఖదీర్, యూసుఫ్, రఫీక్ ,జాఫర్, ఖవిజానీ, రహీం, సైదులు, గౌస్, అఖిల్, అక్బర్, అలీమ్, జానీ, నఫీర్, చోటు, భయం ఖురోషి, రహీం ఖురోసి, హైమద్, అబ్దుల్ ఖయ్యూం, అసిఫ్, ఇమ్రాన్,సోహన్, ,,సోహెల్, ఆఫ్టాబ్, భారీ, తదితరులు పాల్గొన్నారు.




