Maheshwaram: రావిర్యాల సూర్యగిరి ఎల్లమ్మ ఆలయంలో చోరీ!

Maheshwaram: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం రావిర్యాలలోని ప్రముఖ సూర్యగిరి ఎల్లమ్మ ఆలయంలో దొంగతనానికి పాల్పడ్డ అపరిచిత వ్యక్తి. హుండీ ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు.

K Sai, Maheswaram
Published on: 28 Aug 2026 10:05 AM IST
Maheshwaram
X

Maheshwaram: రావిర్యాల సూర్యగిరి ఎల్లమ్మ ఆలయంలో చోరీ!

Maheshwaram: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని ప్రసిద్ధ చెందిన సూర్యగిరి ఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి అమ్మవారి గర్భాలయంలో ఉన్న హుండీని ఎత్తుకెళ్లాడు.స్థానికులు, ఆలయ వర్గాల కథనం ప్రకారం.. దొంగ బైక్ పై ఆలయానికి వచ్చి, ఎవరూ లేని సమయం చూసి దర్జాగా హుండీని ఎత్తుకెళ్లాడు. ఉదయం ఆలయానికి వచ్చిన పూజారికి హుండీ కనిపించకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

సమాచారం అందుకున్న ఆలయ కమిటీ సభ్యులు ఆదిబట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఆలయంలో భద్రత కరువైందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చరిత్ర కలిగిన అమ్మవారి దొంగతనం జరగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇకనుంచి ఆలయానికి గట్టి భద్రత ఏర్పాటు చేయాలని ఆలయ కమిటీని పోలీసులను భక్తులు కోరుతున్నారు.

K Sai, Maheswaram

K Sai, Maheswaram