Bowenpally: ఓల్డ్ బోయిన్‌పల్లిలో భారీ చోరీ.. రూ.4 లక్షల నగదు, బంగారం మాయం!
Bowenpally: హైదరాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లిలో భారీ చోరీ. కుటుంబంతో కలిసి ఊరికి వెళ్లిన సమయంలో ఇంట్లో చొరబడ్డ దొంగలు రూ. 4 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలు అపహరణ.
Bowenpally: ఓల్డ్ బోయిన్‌పల్లిలో భారీ చోరీ.. రూ.4 లక్షల నగదు, బంగారం మాయం!
Bowenpally: ఓల్డ్ బోయిన్‌పల్లి భవానీనగర్‌లో భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. బాధితుడు పూస స్వామి (40), చేపల వ్యాపారి, తన కుటుంబ సభ్యులతో కలిసి వైద్య అవసరాల నిమిత్తం జూన్ 1న గజ్వేల్‌కు వెళ్లాడు. జూన్ 3వ తేదీ ఉదయం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి ప్రధాన తలుపు తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించాడు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బీరువాలో భద్రపరిచిన రూ.4 లక్షల నగదు, 5.5 తులాల బంగారు ఆభరణాలు, 19 తులాల వెండి ఆభరణాలు గుర్తుతెలియని దుండగులు అపహరించినట్లు గుర్తించారు.
Next Story




