LB Nagar: ముగ్గురు ప్రముఖ విద్యావేత్తలకు ‘శిక్షా భూషణ్’ పురస్కారాలు!

LB Nagar: నాగోలులో అఖిల భారతీయ శిక్షా భూషణ్ సమ్మాన్ ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ సహా ముగ్గురు ప్రముఖ విద్యావేత్తలకు ఘన సత్కారం చిన్న జీయర్ స్వామి మంగళాశాసనం.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 3 Oct 2026 10:25 PM IST
LB Nagar
X

LB Nagar: ముగ్గురు ప్రముఖ విద్యావేత్తలకు ‘శిక్షా భూషణ్’ పురస్కారాలు!

ఎల్బీనగర్: భారతీయ విద్యా వ్యవస్థకు విశేష సేవలందించిన ముగ్గురు ప్రముఖ విద్యావేత్తలకు ఘనంగా సత్కరించి పురస్కారాలను ప్రధానం చేశారు. నాగోలులోని శుభం కన్వెన్షన్ సెంటర్లో అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహా సంఘ్ (ఏబీఆర్ఎస్ఎం) ఆధ్వర్యంలో అఖిల భారతీయ శిక్షా భూషణ్ సమ్మాన్ సమారోహ్ శనివారం ఘనంగా నిర్వహించారు.

భారతీయ విద్యా వ్యవస్థకు విశేష సేవలందించిన ముగ్గురు ప్రముఖ విద్యావేత్తలను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించి పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్కార్యవాహ్ పూజ్య సి.ఆర్. ముకుంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏబీఆర్ఎస్ఎం జాతీయ అధ్యక్షులు ప్రొఫెసర్ నారాయణ్ లాల్ గుప్తా సభాధ్యక్షత వహించగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి విశిష్ట అతిథిగా పాల్గొని మంగళాశాసనం అందించారు.

2026 సంవత్సరానికి సాహిత్యం, విద్యా విభాగంలో పద్మశ్రీ పురస్కారం పొందిన ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ను శిక్షా భూషణ్ పురస్కారంతో సత్కరించారు. యూజీసీ మాజీ చైర్మన్. ప్రస్తుతం ఐఐఎం కలకత్తా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్గా ఉన్న ఆయన జాతీయ విద్యా విధానం-2020 అమలు. ఉన్నత విద్యలో సంస్కరణలు, ప్రాంతీయ భాషల్లో ఉన్నత విద్య. ఆన్లైన్ విద్యా విస్తరణ తదితర రంగాల్లో చేసిన కృషిని నిర్వాహకులు గుర్తు చేశారు.

ఎఐఎం బెంగళూరు మాజీ ప్రొఫెసర్, డీన్ ప్రొఫెసర్ బి. మహదేవన్ ను సత్కరించారు. భారతీయ జ్ఞాన వ్యవస్థ, వేదాలు, భగవద్గీత, నిర్వహణ విద్య తదితర అంశాలపై ఆయన చేసిన పరిశోధన, బోధన సేవలను నిర్వాహకులు ప్రశంసించారు. భారతీయ జ్ఞాన సంప్రదాయాన్ని ఆధునిక విద్యతో అనుసంధానించడంలో ఆయన కృషిని వివరించారు. విజ్ఞాన విహార విద్యా సంస్థలు, విశాఖపట్నం మాజీ ప్రిన్సిపాల్ డి. రామకృష్ణారావును పురస్కారంతో సన్మానించారు.

విద్యా భారతి జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన జాతీయ విద్యా విధానం-2020 అమలుకు కేంద్ర ప్రభుత్వానికి విద్యా సామగ్రి, సూచనలు అందించడంతో పాటు వివిధ రాష్ట్రాల ఎస్సీఈఆర్టీలకు పాఠ్యప్రణాళిక, బోధనా విధానాలపై సూచనలు అందించారని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏబిఆర్ఎస్ఎం జాతీయ కార్యదర్శి ఆచార్య గీతా భట్. ఆర్గనైజింగ్ కార్యదర్శి మహేంద్ర కపూర్, జాయింట్ ఆర్గనైజింగ్ కార్యదర్శితో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన కిషన్, ఏలూరి యాదయ్య, డాక్టర్ కె. భాస్కర్, జగన్, దయానంద్ ఆర్య తదితరులు పాల్గొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR