Miyapur: హెచ్-సిటీ పనులపై ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
Miyapur: హెచ్-సిటీ పనుల్లో భాగంగా ఆల్విన్ ఎక్స్ రోడ్స్–హఫీజ్‌పేట ఆర్వోబీ రోడ్డు వెడల్పును 160 అడుగులకు కుదించి నవంబర్ 15 లోగా నోటీసులు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు.
Miyapur: హెచ్-సిటీ పనులపై ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
Miyapur: హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా ఆల్విన్ ఎక్స్ రోడ్స్ మరియు మియాపూర్ ఎక్స్ రోడ్ వద్ద ప్రతిపాదించిన గ్రేడ్ సెపరేటర్ పనులను ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో సిఎంసి కమిషనర్ సృజన శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జోనల్ కమిషనర్‌తో పాటు ఇంజనీరింగ్ మరియు టౌన్ ప్లానింగ్ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆల్విన్ ఎక్స్ రోడ్స్ నుండి హఫీజ్‌పేట ఆర్వోబీ వరకు ప్రతిపాదించిన 200 అడుగుల రోడ్డు విస్తరణ వల్ల ప్రభావితమయ్యే ఆస్తులను అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక పరిస్థితులు, ఆస్తుల నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదిత రోడ్డు వెడల్పును 200 అడుగుల నుండి 160 అడుగులకు కుదించే విషయంపై అధికారులు, ప్రజాప్రతినిధులు చర్చించారు.
సవరించిన 160 అడుగుల అలైన్మెంట్ ఆధారంగా టౌన్ ప్లానింగ్ మరియు ఇంజనీరింగ్ విభాగాలు సంయుక్త సర్వే నిర్వహించాలని ఆదేశించారు. సర్వే పూర్తి చేసి, ప్రభావితమయ్యే ఆస్తుల యజమానులకు నవంబర్ 15వ తేదీ లోపు నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు.
వెహిక్యులర్ అండర్‌పాస్ భాగం వరకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని తక్షణమే పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో మియాపూర్ సర్కిల్-48 డిప్యూటీ కమిషనర్ (DC) మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.




