Shamshabad: నార్సింగి పరిధిలో అనధికార నిర్మాణాలపై మున్సిపల్ అధికారుల ఉక్కుపాదం!
Shamshabad: నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్, 60 గజాల కాలనీల్లో నిబంధనలు ఉల్లంఘించిన భవనాలను సీజ్ చేసి, ఆక్రమణలను అధికారులు తొలగించారు.
Shamshabad: నార్సింగి పరిధిలో అనధికార నిర్మాణాలపై మున్సిపల్ అధికారుల ఉక్కుపాదం!
Shamshabad: నార్సింగి సర్కిల్ పరిధిలో అనధికార నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన భవనాలను సీజ్ చేయడంతో పాటు, అక్రమంగా ఏర్పాటు చేసిన నిర్మాణాలను తొలగించారు.
నెక్నాంపూర్‌లోని కృష్ణారెడ్డి ఎన్‌క్లేవ్‌లో అనుమతికి విరుద్ధంగా అదనపు అంతస్తు నిర్మాణం చేపడుతున్న భవనంపై అధికారులు చర్యలు తీసుకున్నారు. భవనం 5వ అంతస్తుకు ఏర్పాటు చేసిన సెంట్రింగ్ తొలగించి, నిబంధనల ప్రకారం భవనాన్ని సీజ్ చేశారు.
అదేవిధంగా నెక్నాంపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 31లోని సెక్రటేరియట్ ఆల్కపూరి వెంకటేశ్వర కాలనీ పార్కు స్థలంలో చేపట్టిన అనధికార ఆక్రమణలపై అధికారులు చర్యలు చేపట్టారు. పార్కు స్థలంలో ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలను తొలగించి స్థలాన్ని ఆక్రమణల నుంచి విముక్తి చేశారు. అదేవిధంగా నార్సింగి 60 గజాల కాలనీ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన గ్రౌండ్ ప్లస్ ఒక అంతస్తు భవనాన్ని టౌన్ ప్లానింగ్ సిబ్బంది సీజ్ చేశారు.
అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం, ప్రభుత్వ లేదా పార్కు స్థలాలను ఆక్రమించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని డిప్యూటీ కమిషనర్ లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే నిర్మాణదారులు, ఆక్రమణదారులపై చట్టప్రకారం కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.




