Hyderabad: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఆశావహులతో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ!
Hyderabad: గాంధీభవన్‌లో నేడు టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన కీలక సమావేశం. ఎమ్మెల్సీ టికెట్లు దక్కక అసంతృప్తిగా ఉన్న ఆశావహులను బుజ్జగించేలా చర్చలు.
Hyderabad: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఆశావహులతో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ!
Hyderabad: ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో కీలక సమావేశం జరగనుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఆశావహులను బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు టీపీసీసీ అధ్యక్షులు. ఇందులో భాగంగా.. టికెట్ ఆశించి భంగపడ్డవారితో ఆయన భేటీ కానున్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామ రామ్మోహన్‌రెడ్డి బరిలోకి దిగనున్నారు. అటు నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్వోత్తమ్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది.
అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఆశించి భంగపడ్డ కొందరు.. పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన టీపీసీసీ చీఫ్ వారిని బుజ్జగించే పనిని తన భుజాన వేసుకున్నారు.




