Alkapuri: సాయిబాబా ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు!

Alkapuri: మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం అల్కాపురి సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకల్లో టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 29 July 2026 8:28 PM IST
Alkapuri
X

Alkapuri: సాయిబాబా ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు!

అల్కాపురి: గురుపౌర్ణమి సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గంలోని రామకృష్ణపురం (ఆర్కే పురం) డివిజన్ అల్కాపురి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్ రెడ్డి పాల్గొని సాయిబాబా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చిలుక ఉపేందర్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావు, ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం తలాటి రమేష్ నేత, డివిజన్ అధ్యక్షులు ధనరాజ్ గౌడ్, ముప్పిడి లింగస్వామి గౌడ్, జ్ఞానేశ్వర్ యాదవ్, యాదవ్ రెడ్డి, రామకృష్ణ గౌడ్, రాజు, జంగారెడ్డి, కృష్ణారావు, ఆలయ ప్రధాన అర్చకులు జయంత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story