Secunderabad: ఓల్డ్ బోయిన్‌పల్లిలో మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో బండి రమేష్!
Secunderabad: ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్‌లో నిర్వహించిన మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో టీపీసీసీ ఉపాధ్యక్షులు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
Secunderabad: ఓల్డ్ బోయిన్‌పల్లిలో మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో బండి రమేష్!
సికింద్రాబాద్: ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్‌లో మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి. అరవింద్ కిశోర్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మరియు తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బండి రమేష్ ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలియజేశారు. మహ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి గొప్ప విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని అన్నారు. సమాజంలో అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవం, ఐక్యతతో కలిసి మెలిసి జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మరియు మైనార్టీ నాయకులు దండుగుల యాదగిరి, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు ,మాకినేని వినోద్ ,కిరణ్ గౌడ్, నల్లోల్ల రాజేందర్, శివ యాదవ్, విజయ్ కాంత్ రెడ్డి, రాకేష్ గౌడ్, అంజద్, ముస్తఫా అలీ, ఆదిల్ పఠాన్, మున్ను, దీపక్, సతీష్ పటేల్, అస్లాం, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.




