Malkajgiri: మల్కాజిగిరి: అభివృద్ధి పనులను పరిశీలించిన ట్రాఫిక్ డీసీపీ!
Malkajgiri: మల్కాజిగిరి వాజ్‌పేయి నగర్ వద్ద జరుగుతున్న రైల్వే అండర్ బ్రిడ్జి ఉత్తమ్ నగర్ సీసీ రోడ్డు పనులను ట్రాఫిక్ డీసీపీ కె. రాహుల్ రెడ్డి పరిశీలించారు.
Malkajgiri: మల్కాజిగిరి: అభివృద్ధి పనులను పరిశీలించిన ట్రాఫిక్ డీసీపీ!
మల్కాజిగిరి: మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాజ్‌పేయి నగర్ రైల్వే గేట్ వద్ద జరుగుతున్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు, ఉత్తమ్ నగర్‌లో కొనసాగుతున్న సీసీ రోడ్డు పనులను మల్కాజ్‌గిరి ట్రాఫిక్-1 డీసీపీ కె. రాహుల్ రెడ్డి పరిశీలించారు. సోమవారం మల్కాజిగిరి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. నరసింహ, రైల్వే అధికారులు, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏఈ దివ్య జ్యోతి, వర్క్ ఇన్‌స్పెక్టర్ సుబ్రహ్మణ్యంతో కలిసి నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాలను డీసీపీ సందర్శించారు.
నిర్మాణ పనుల నేపథ్యంలో చేపట్టాల్సిన ట్రాఫిక్ మళ్లింపు,ట్రాఫిక్ నియంత్రణ,నిర్వహణ చర్యలపై అధికారులతో చర్చించారు.పనులు కొనసాగుతున్న సమయంలో వాహనదారులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం లేకుండా సమర్థవంతమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను డీసీపీ ఆదేశించారు.రోడ్డు వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.




