Hyderabad: రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించిన లంగర్ హౌస్ సీఐ!
Hyderabad: హైదరాబాద్ జియాగూడలోని శ్లోక స్కూల్‌లో తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో 'Arrive Alive' రోడ్డు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు.
Hyderabad: రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించిన లంగర్ హౌస్ సీఐ!
హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణ మరియు విధ్యార్థులలో రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన పెంచే లక్ష్యంతో తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్ నిర్వహిస్తున్న ‘Arrive Alive’ ప్రోగ్రామ్‌లో భాగంగా జియాగూడలోని శ్లోక స్కూల్‌లో శనివారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించడమైనది. లంగర్ హౌస్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ (SHO) పి. అంజయ్య గారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 450 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లంగర్ హౌస్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విద్యార్థులకు క్రింది ముఖ్యమైన రోడ్డు భద్రతా అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. పాదచారుల బాధ్యత (Pedestrian Crossing): రహదారి దాటే సమయంలో జీబ్రా క్రాసింగ్ ప్రాముఖ్యత మరియు సురక్షితమైన పద్ధతులు. మైనర్ డ్రైవింగ్ నివారణ (Minor Driving) 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, తల్లిదండ్రులు కూడా దీనికి బాధ్యులవుతారని హెచ్చరించారు.
లైసెన్స్ లేని ప్రయాణం (Driving without License) చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వల్ల కలిగే తీవ్ర పరిణామాలు. హెల్మెట్ ధారణ తప్పనిసరి (Driving without Helmet): ద్విచక్ర వాహనదారులు, వెనుక కూర్చునే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుండి ఎలా రక్షణ పొందోచ్చో వివరించారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ (Cell Phone Driving) వాహనం నడిపేటప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం వల్ల దృష్టి మరలి ప్రమాదాలు ఎలా జరుగుతాయో తెలియజేశారు.
రాంగ్ రూట్ డ్రైవింగ్ (Wrong Route Driving) ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా రాంగ్ రూట్‌లో ప్రయాణించడం ఎంత ప్రమాదకరమో వివరించారు. ఆటోలలో మితిమీరిన ప్రయాణికులు / విద్యార్థుల ప్రయాణం (Auto Piloting/Overloading) పాఠశాల ఆటోలలో పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్లడం మరియు ఆటో డ్రైవర్ల నిర్లక్ష్యపు డ్రైవింగ్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
విద్యార్థులు చిన్నతనం నుంచే రోడ్డు నిబంధనలను పాటించే అలవాటు చేసుకోవాలని, తమ ఇళ్లలోని పెద్దలకు కూడా ఈ విషయాలపై అవగాహన కల్పించాలని ఇన్స్పెక్టర్ కోరారు. సురక్షితమైన ప్రయాణమే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.




