Jawaharnagar: జవహర్ నగర్ ట్రాఫిక్ పీఎస్‌లో ఉచిత హెల్త్ క్యాంప్ ప్రారంభం!
Jawaharnagar: జవహర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో రెటినోవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
Jawaharnagar: జవహర్ నగర్ ట్రాఫిక్ పీఎస్‌లో ఉచిత హెల్త్ క్యాంప్ ప్రారంభం!
Jawaharnagar: జవహర్ నగర్ ట్రాఫిక్ పోలీసుల కోసం ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరం.
ప్రజా సేవలో నిరంతరం విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా రెటినోవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జవహర్ నగర్‌లోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరానికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ సహకారం అందిస్తుండగా, మల్కాజిగిరి కమిషనరేట్ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కే. రాహుల్ రెడ్డి, ఐపీఎస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసిపి సుబ్బయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించే ఈ శిబిరంలో ట్రాఫిక్ పోలీసులకు కంటి పరీక్షలు, దంత పరీక్షలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు, బీపీ, బ్లడ్ షుగర్, ఈసీజీ, డెంటల్ పరీక్షలు, అలాగే ఫిజియోథెరపీ సేవలు అందించారు.
కార్యక్రమంలో ప్లానెట్ ఆప్టిక్స్, శ్రీకర హాస్పిటల్స్, పద్మసాయి డెంటల్ క్లినిక్ తదితర వైద్య సంస్థలు భాగస్వామ్యం కాగా, ప్రజల భద్రత కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని, వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఏసీపీ సుబ్బయ్య తెలిపారు.
ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ శివశంకర్, జవహర్ నగర్ ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




