Vikarabad: సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలిచిన రితిక్ రెడ్డి!
Vikarabad: పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి తనయుడు డాక్టర్ రితిక్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
Vikarabad: సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలిచిన రితిక్ రెడ్డి!
PARGI: వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి తనయుడు, టీపీసీసీ మెంబర్, టీఆర్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ టి. రితిక్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేవలం పుట్టినరోజు వేడుకలకే పరిమితం కాకుండా. ప్రజలకు ఉపయోగపడేలా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
జన్మదిన వేడుకల్లో భాగంగా మన్నెగూడలో వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అదేవిధంగా కుల్కచర్లలో టీఆర్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్‌తో పాటు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పలువురు రక్తదాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఇక నాంచర్ల గ్రామంలో వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేసి అండగా నిలిచారు. అలాగే దోమ మండలం గంజిపల్లి గ్రామాన్ని సందర్శించి.. పేద విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు.
విద్యార్థుల చదువుకు ప్రయాణం అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.సాయంత్రం పరిగి కోర్టు సమీపంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సూచించారు. మరోవైపు కొడంగల్ చౌరస్తాలో అభిమానులు, కార్యకర్తలు ఘనంగా రితిక్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. భారీ గజమాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా తన జన్మదినాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన కార్యకర్తలకు, అభిమానులకు రితిక్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులోనూ పేదలు, నిరుపేదలు, అవసరంలో ఉన్న ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తానని రితిక్ రెడ్డి తెలిపారు. పుట్టినరోజు అంటే కేవలం వేడుకలు మాత్రమే కాదు. ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపట్టడమే అసలైన సంతోషం అన్న సందేశాన్ని రితిక్ రెడ్డి జన్మదిన వేడుకలు చాటిచెప్పాయి.




