Vikarabad: టీచర్ రూపా రెడ్డి హత్యకు నిరసనగా వికారాబాద్‌లో ‘ట్రస్మా’ కొవ్వొత్తుల ర్యాలీ!

Vikarabad: ప్రిన్సిపల్ రూపా రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ వికారాబాద్‌లో ప్రైవేట్ పాఠశాలల సంఘం (TRSMA) ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 24 Aug 2026 11:47 PM IST
Vikarabad
X

Vikarabad: టీచర్ రూపా రెడ్డి హత్యకు నిరసనగా వికారాబాద్‌లో ‘ట్రస్మా’ కొవ్వొత్తుల ర్యాలీ!

వికారాబాద్‌: నల్గొండ జిల్లాలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్, టీచర్ రూపా రెడ్డి దారుణ హత్యను ఖండిస్తూ వికారాబాద్‌ పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం (TRSMA) ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా టీచర్ రూపా రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించిన ట్రస్మా ప్రతినిధులు, పాఠశాల యాజమాన్యాలు.. దారుణానికి ఒడిగట్టిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని, ఉపాధ్యాయులకు తగిన రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ట్రస్మా నాయకులు, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story