Hyderabad: పదేళ్ల తర్వాత ఆర్టీసీలో భారీ నోటిఫికేషన్లకు సర్కార్ అనుమతి
Hyderabad: తెలంగాణ ఆర్టీసీలో 1,500 కండక్టర్ పోస్టుల నియామకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Hyderabad: పదేళ్ల తర్వాత ఆర్టీసీలో భారీ నోటిఫికేషన్లకు సర్కార్ అనుమతి
Hyderabad: టిఎస్‌ఆర్టీసీలో 1500 కండక్టర్ పోస్టుల నియామకాలకు అనుమతి ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సమాఖ్య ప్రకటించింది.
1500 కండక్టర్ పోస్టులకు అనుమతిచ్చిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు గౌరవనీయులైన రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని సమాఖ్య అధ్యక్షులు కొమిరెల్లి రాజిరెడ్డి తెలిపారు.
2014 నుండి 2024 వరకు 10 సంవత్సరాలలో ఆర్టీసీలో ఒక్క పోస్ట్ కు కూడా గత ప్రభుత్వం అనుమతించలేదని, రిటైర్ అవ్వడమే తప్ప నియామకాలు చేపట్టకుండా ఉన్న కార్మికులపై పని భారాలను పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరాల కాలంలోనే ట్రాఫిక్ సూపర్ వైజర్ పోస్టులు 84, మెకానికల్ సూపర్ వైజర్ పోస్టులు 114, శ్రామిక్ పోస్టులు 743, డ్రైవర్ పోస్టులు 2000, కండక్టర్ పోస్టులు 1500 తదితర మొత్తం 4500 పోస్టులకు పైగా అనుమతివ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
గత ప్రభుత్వం ఆర్టీసీలో నియామకాల ప్రక్రియను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు అప్పగించగా, వివిధ కారణాల వలన ఆలస్యం అవుతోందని, దీన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కండక్టర్ పోస్టుల నియామకాల బాధ్యతను ఆర్టీసీకే అప్పగించడాన్ని కూడా స్వాగతిస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన అన్ని రకాల పోస్టులను కాంట్రాక్టు, క్యాజువల్, ఔట్ సోర్సింగ్ విధానంలో కాకుండా, దశాబ్దాలుగా జరుగుతున్న విధానాలకు స్వస్తి పలుకుతూ డైరెక్ట్ రెగ్యులర్ ప్రాతిపదికన, టైం స్కేల్ ఇస్తూ నియామకాలకు అనుమతించడం చారిత్రాత్మక సాహసోపేతమైన నిర్ణయమని కొనియాడారు.
రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన అన్ని రకాల పోస్టులను త్వరిత గతిన నియామకాలు చేపట్టాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరుతున్నామని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సమాఖ్య పక్షాన కొమిరెల్లి రాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు.




