Hyderabad: ఆర్టీసీ కార్మిక సంక్షేమానికి కృషి చేసేవారినే గెలిపించండి!
Hyderabad: ఈనెల 9న జరగనున్న ఆర్టీసీ ఎన్నికల్లో కార్మిక పరిషత్ అభ్యర్థులను గెలిపించాలని కోరిన సంఘం అధ్యక్షులు ఎం.కే.బోస్, జనరల్ సెక్రటరీ బి.యాదగిరి.
Hyderabad: ఆర్టీసీ కార్మిక సంక్షేమానికి కృషి చేసేవారినే గెలిపించండి!
Hyderabad: ఆర్టిసి కార్మికులు 2019 లో 36 మంది ఆత్మ బలిదానాల తో సమ్మెలో తీవ్రంగా నష్టపోయారని ఆ బలిదానాలతోనే ఆర్టీసీ ఈరోజు సంరక్షించబడుతుంది కానీ మరో పక్క ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్న సందర్భంగా ఆర్టీసీ కార్మికులు మనోధైర్యం కోల్పోయి అయోమయానికి గురి అవుతున్నారని అలాంటి పరిస్థితి నుండి రక్షించడానికి పోరాటం చేస్తున్న టీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ నుండి ఎన్నికలలో పోటీ చేస్తున్న తమను గెలిపించాల్సిందిగా పరిషత్ అధ్యక్షులు ఎం.కే.బోస్, జనరల్ సెక్రటరీ బి.యాదగిరి అన్నారు.
గతంలో ఆర్టీసీ కార్మికులను సమ్మెకు ఉసిగొలిపి కార్మికుల నష్టానికి కొంతమంది కారణమయ్యారని అన్నారు. టి ఎస్ ఆర్ టి సి సంస్థ తో పాటు కార్మికుల సంక్షేమానికి కూడా కృషి చేసే వారికే ఈనెల తొమ్మిదిన జరగబోయే ఎన్నికలలో ఓటు వేసి గెలిపించాలని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు.




