Pargi: సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్: పరిగిలో పోస్టర్ ఆవిష్కరణ!

Pargi: వికారాబాద్ జిల్లా పరిగిలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న జరగనున్న 'చలో హైదరాబాద్' గోడపత్రికను TSUTF నాయకులు ఆవిష్కరించారు.

WAZID, PARIGI
Published on: 7 Sept 2026 7:18 PM IST
Pargi
X

Pargi: సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్: పరిగిలో పోస్టర్ ఆవిష్కరణ!

PARGI: వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్, కార్మికుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. పరిగిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో TSUTF పరిగి మండల నేతలు పాల్గొని గోడపత్రికను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు, మండల అధ్యక్షులు దశరథ మాట్లాడుతూ... ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సెప్టెంబర్ 10న నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ స్థానంలో ఓపీఎస్‌ను ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేశారు.

అలాగే పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసి అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న అన్ని ఆర్థిక బిల్లుల బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు కె. వెంకటయ్య, మండల ప్రధాన కార్యదర్శులు జైపాల్, శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు లావణ్య, ఇందిరా, స్వర్ణకుమారితో పాటు పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.

WAZID, PARIGI

WAZID, PARIGI

Next Story