Medipally: లబ్ధిదారుడి ఇంటికే వెళ్లి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేసిన రవి

Medipally: డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్‌ యాదవ్‌ సహకారంతో మేడిపల్లి శ్రీనివాసనగర్ వాసి తిరుమల్‌రావు ఇంటికే వెళ్లి తుంగతుర్తి రవి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేశారు.

KARUNAKAR, UPPAL
Published on: 12 Nov 2026 9:29 PM IST
Medipally
X

Medipally: లబ్ధిదారుడి ఇంటికే వెళ్లి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేసిన రవి

మేడిపల్లి: ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) అండగా నిలుస్తోందని మేడిపల్లి డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి అన్నారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆర్థిక భారాన్ని మోయలేని పరిస్థితుల్లో ఉన్న వారికి ప్రభుత్వ సహాయం ఎంతో ఊరటనిస్తుందన్నారు.

మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ సహకారంతో బోడుప్పల్‌ సర్కిల్‌ పరిధిలోని మేడిపల్లి డివిజన్‌ శ్రీనివాసనగర్‌ కాలనీకి చెందిన తిరుమల్‌రావుకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును తుంగతుర్తి రవి ఆయన ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ.. ప్రజా పాలనలో ప్రజల వద్దకే పాలన అనే లక్ష్యంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, వారికి అందుబాటులో ఉంటూ సాధ్యమైనంత త్వరగా సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ సహకారంతో నియోజకవర్గ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం పొందిన తిరుమల్‌రావు కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరిగే సతీష్‌, కొమ్ము బంగారయ్య, అక్కల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL