Kapra: కాప్రాలో జాతీయ మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని TUWJ డిమాండ్!
Kapra: మేడ్చల్ జిల్లా కాప్రాలో జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, జాతీయ మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు.
Kapra: కాప్రాలో జాతీయ మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని TUWJ డిమాండ్!
Kapra: జాతీయ మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలని, ఆ కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్త మీడియా చట్టాన్ని తీసుకొచ్చి జర్నలిస్టులు, మీడియా సంస్థల సమస్యలు పరిష్కరించాని టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి మోతే వెంకటరెడ్డి పేర్కొన్నారు.
ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ( IJU) పిలుపుమేరకు అక్టోబర్ 2న జర్నలిస్టుల డిమాండ్స్ డే ను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ) మేడ్చల్ జిల్లా కార్యదర్శి డి వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో ఈసీఐఎల్ చౌరస్తాలో జర్నలిస్టులు ర్యాలీ చేపట్టిన అనంతరం కాప్రా సర్కిల్ కార్యాలయంలో ఉన్న గాంధీ విగ్రహానికి జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
టీయుడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి మోతే వెంకటరెడ్డి, స్టేట్ కౌన్సిల్ సభ్యులు టి మల్కయ్య లు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంగా పనిచేస్తున్న.
జర్నలిస్టులు మరియు మీడియా సంస్థల భద్రత కోసం ప్రత్యేక కేంద్ర చట్టాన్ని రూపొందించాలన్నారు. అందుకోసం కేంద్రం మీడియా రంగంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా నూతన చట్టం రూపొందించేందుకు తగు సిఫార్సుల కోసం జాతీయ స్థాయిలో మీడియా కమిషన్ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
1955 మరియు 1958 సంవత్సరాల చట్టాల ద్వారా గతంలో జర్నలిస్టులకు కల్పించబడిన ప్రత్యేక రక్షణలను తక్షణమే పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. మీడియా ఉద్యోగుల కోసం కొత్త వేతన బోర్డును ఏర్పాటు చేయాలి కోరారు. టి యు డబ్ల్యూ జే మేడ్చల్ జిల్లా కార్యదర్శి దొంతుల వెంకట్రాం రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరి మూడు సంవత్సరాలు కావస్తున్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. జర్నలిస్టుల ఇండ్లు, ఇండ్ల స్థలాల, ఆరోగ్య భద్రత కార్డుల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను తక్షణమే పునరుద్ధరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే కాప్రా ప్రెస్ క్లబ్, మేడిపల్లి ప్రెస్ క్లబ్, ఉప్పల్ ప్రెస్ క్లబ్, షామీర్పేట ప్రెస్ క్లబ్, కీసర ప్రెస్ క్లబ్, ఘట్కేసర్ ప్రెస్ క్లబ్, ఉప్పల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్లర్, అల్వాల్ ప్రెస్ క్లబ్ ల ప్రతినిధులు, జవహర్ నగర్, మల్కాజిగిరి జర్నలిస్టులు పెద్ద ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (ఏఐవైఎఫ్) నాయకులు కే ధర్మేంద్ర, టి సత్యప్రసాద్ సిపిఎం పార్టీ కోమటి రవి, యాదగిరిరావు తదితరులు పాల్గొన్నారు.




