Mallapur: జర్నలిస్టుల సమస్యలపై ఆందోళన తప్పదు - టీయూడబ్ల్యూజే కోశాధికారి మోతె వెంకట్!
Mallapur: ఉప్పల్ నియోజకవర్గ జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే కోశాధికారి మోతె వెంకటరెడ్డి హెచ్చరిక.
Mallapur: జర్నలిస్టుల సమస్యలపై ఆందోళన తప్పదు - టీయూడబ్ల్యూజే కోశాధికారి మోతె వెంకట్!
Mallapur: జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే ఆందోళన బాట తప్పదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కోశాధికారి మోతే వెంకటరెడ్డి హెచ్చరించారు. ఉప్పల్ నియోజకవర్గం సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం మల్లాపూర్ లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకటరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏమాత్రం చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాపాలన పేరుతో జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఆరోగ్య భద్రతపై దృష్టి సారించాలని ఆయన కోరారు. ఇప్పటికైనా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు మాట్లాడుతూ జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులందరికి అక్రిడిటేషన్ లు వచ్చేలా సంఘం పాటుపడిందని స్పష్టం చేశారు.
ఐక్యమత్యంగా ఉంటేనే సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయడం సులభతరం అవుతుందని పేర్కొన్నారు. జిల్లాలో అతిపెద్ద సంఘంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం మన సంఘం ఎప్పుడు ముందుంటుందని స్పష్టం చేశారు.
జిల్లా కార్యదర్శి డి వెంకట్ రామ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు టి.మల్కయ్య, జిల్లా ఉపాధ్యక్షులు రాంప్రసాద్ శర్మ, కేసీ మోహన్, పంజాల శ్రీనివాస్ గౌడ్, అక్బర్, ఆదిమూలం శ్రీనివాస్, రంగు మల్లేష్, రమేష్, జిల్లా హెల్త్ కమిటీ కన్వీనర్లు కొలనుపాక చంద్రమౌళి, విజయ్ లు, టీయూడబ్ల్యూజే ఉప్పల్ నియోజకవర్గ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డి సురేష్, ఉపాధ్యక్షులు రుద్రగోని నర్సింగ్, కోశాధికారి వేముల శంకర్, ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల తిరుపతిరెడ్డి, కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జ్యోతిర్మయ చారి, ఉప్పల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వడ్డేపల్లి కిషోర్, నియోజకవర్గంలోని జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




