Medchal: ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులపై మాట తప్పిన ప్రభుత్వం: TWJF

Medchal: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 13న మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాలో వందలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని TWJF మల్కాజిగిరి కన్వీనర్

Bodike Manohar, Malkajgiri
Updated on: 9 July 2026 7:26 PM IST
Medchal
X

Medchal: ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులపై మాట తప్పిన ప్రభుత్వం: TWJF

మేడ్చల్: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన,ధర్నా కార్యక్రమం లో భాగంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో ఈ నెల 13 వ తేదీన మేడ్చల్ కలెక్టర్ ట్ కార్యాలయం ముందు జరిగే ధర్నా కార్యక్రమానికి వందలాది జర్నలిస్టులు పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వర్కింగ్‌ ‌జర్నలిస్టు ఫెడరేషన్‌ (టీడబ్ల్యూజేఎఫ్‌) మల్కాజిగిరి నియోజవర్గ కన్వీనర్ జే సుధాకర్ పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

ఈనెల 13న జిల్లా కలెక్టర్ లకు వినతిపత్రాలు అందజేసి నిరసనలు,15 వ తేదీన రాష్ట్ర సమాచార కమిషనర్‌ ‌కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.జర్నలిస్టుల హెల్త్‌‌కార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని,హెల్త్‌ కార్డులు నిమ్స్‌ ఆస్ప్రతి తప్ప ఏ ఇతర ప్రవేట్ ఆస్ప్రతుల్లో పని చేయడం లేదని,వెంటనే జర్నలిస్టులందరికీ నూతన హెల్త్‌‌కార్డులు ఇవ్వాలన్నారు.

జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఇంటి స్థలాలపై నిర్ణయం తీసుకోకపోవడంతో కార్యాచరణ ముందుకు సాగడం లేదని,ఇంటి స్థలాల విషయంలో ప్రభుత్వం జర్నలిస్టులకు మాట ఇచ్చి,ఆ తర్వాత మాట తప్పుతుందని విమర్శించారు. అక్రిడిడేషన్‌ ‌కార్డుల పంపిణీ ఆలస్యమవుతున్నదని, అర్హులైన జర్నలిస్టులకు వెంటనే అక్రిడిడేషన్‌ ‌కార్డులు పంపిణీ చేయాలని, ప్రయివేట్‌,కార్పొరేట్‌ ‌విద్యా సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు వంద శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని కోరారు.దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story