Uppal: ఉప్పల్‌లో దారుణం.. వాకింగ్ చేస్తున్న మహిళ మెడలో 5 తులాలు గాయబ్!
Uppal: హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని పీర్జాదిగూడ వినాయకనగర్ కాలనీలో దారుణం జరిగింది.
Uppal: ఉప్పల్‌లో దారుణం.. వాకింగ్ చేస్తున్న మహిళ మెడలో 5 తులాలు గాయబ్!
ఉప్పల్: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడ వినాయకనగర్ కాలనీలో మహిళ మెడలోని బంగారు మంగళసూత్రాన్ని గుర్తుతెలియని దుండగులు అపహరించిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వినాయకనగర్ కాలనీ రోడ్ నంబర్-1లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కావడి మాణిక్యప్ప సతీమణి కావడి అనిత (56) గురువారం సాయంత్రం సుమారు 5.50 గంటల సమయంలో ఇంటి ముందు గల కాలనీ రోడ్డుపై వాకింగ్ చేస్తుండగా, బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మాటలతో మాయమాటలు చెప్పి ఆమె మెడలోని మంగళసూత్రాన్ని బలవంతంగా లాక్కెళ్లారు. బాధితురాలి మెడలో ఉన్న మంగళసూత్ర చైన్ లో రెండు పుస్తెలు, గుండ్లు, లక్ష్మీ బిళ్ల ఉండగా, మొత్తం సుమారు ఐదు తులాల బంగారం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటన అనంతరం నిందితులు బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు కావడి మాణిక్యప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాలనీలోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.




