Medipally: మేడిపల్లిలో ఇద్దరు బాలురు అదృశ్యం!

Medipally: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు బాలురు అదృశ్యం ఆడుకునేందుకు వెళ్లి రాని లోకేష్, సాయి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి గాలిస్తున్న పోలీసులు.

KARUNAKAR, UPPAL
Published on: 2 Oct 2026 11:44 PM IST
Medipally
X

Medipally: మేడిపల్లిలో ఇద్దరు బాలురు అదృశ్యం!

మేడిపల్లి: ఇద్దరు బాలురు అదృశ్యమైన ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. మేడిపల్లి ఇన్‌స్పెక్టర్‌ జలంధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్‌ 2న సెలవు కావడంతో పీర్జాదిగూడకు చెందిన థాబెటి సాయినాథ్‌ లోకేష్‌(13) తన స్నేహితుడు మల్లికార్జున్‌నగర్‌కు చెందిన వీర్నగరి సాయి (14)తో కలిసి ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.

ఉదయం సుమారు 10 గంటల వరకు ఇద్దరూ కలిసి మల్లికార్జున్‌నగర్‌లోని ఇంట్లో ఆడుకున్నారు. అనంతరం బయటకు వెళ్లి ఆడుకుని వస్తామని చెప్పి ఇంటి నుంచి వెళ్లారు. అయితే ఎంతసేపటికీ ఇద్దరూ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి వద్ద ఆరా తీయడంతోపాటు బాలురకు తెలిసిన ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు.

దీంతో థాబెటి సాయినాథ్‌ లోకేష్‌ తల్లి శ్రీలత మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, అదృశ్యమైన ఇద్దరు బాలుర ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. బాలుర ఆచూకీ తెలిసిన వారు లేదా ఎక్కడైనా కనిపించినట్లయితే వెంటనే మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని ఇన్‌స్పెక్టర్‌ జలంధర్‌రెడ్డి కోరారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL