Alwal: వెంకటేశ్వర కాలనీలో యూజీడీ పనులను ప్రారంభించిన శ్రీకాంత్ యాదవ్!

Alwal: చంద్రపురి కాలనీ డివిజన్ వెంకటేశ్వర కాలనీలో యూజీడీ పనులు ప్రారంభం. డివిజన్ అభివృద్ధే తన ధ్యేయమని తెలిపిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్.

PURENDAR, ALWAL
Published on: 21 Oct 2026 12:12 PM IST
Alwal
X

Alwal: వెంకటేశ్వర కాలనీలో యూజీడీ పనులను ప్రారంభించిన శ్రీకాంత్ యాదవ్!

Alwal: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చంద్రపురి కాలనీ డివిజన్, వెంకటేశ్వర కాలనీలో యూజీడీ (భూగర్భ డ్రైనేజీ) పనులను డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ గొడుగు వేణుతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ.. డివిజన్ అభివృద్ధే తన ప్రధాన ధ్యేయమని తెలిపారు. కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపట్టేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చిట్టి బాబు, ప్రధాన కార్యదర్శి బూడిద వెంకటేష్, జోగి సునీత, సీనియర్ నాయకులు రజిత గోపాల్, నర్ర మహేష్, భాస్కర్ గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాహుల్ కదం, మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండీ గౌస్, స్థానికులు బషీర్, షఫీ, శ్రీరామ్, నాగరాజు, శ్రీనివాస్, స్రవంతి, స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL