Secunderabad: ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి గాజుల అలంకరణ!
Secunderabad: ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు. వరలక్ష్మి వ్రతం వేళ భక్తులతో ఆలయం కిటకిటలాడింది.
Secunderabad: ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి గాజుల అలంకరణ!
Secunderabad: శ్రావణమాసం రెండో శుక్రవారం ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి గాజుల అరులంకరణతో ఆలయమంతా శుభ్రంగా ముస్తాబు చేశారు ఆలయ అధికారులు. ఉదయం నుండి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు వరలక్ష్మి వ్రతం పురస్కరించుకొని మహిళలు ఒకరికి ఒకరు వాయినాలు ఇచ్చుకుంటూ ఓడి బియ్యం సమర్పించుకున్నారు. ఆలయమంతట ఆధ్యాత్మిక శోభనం సంతరించుకుంది భక్తులకు క్యూలైన్లు ఏర్పాటు చేసి త్వరగా దర్శనం అయ్యేవిధంగా చర్యలు చేపట్టారు.
Next Story




