Hyderabad: సరూర్‌నగర్ చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం!
Hyderabad: సరూర్‌నగర్ చెరువులో సుమారు 40 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి, కేసు నమోదు చేసిన సరూర్‌నగర్ పోలీసులు.
Hyderabad: సరూర్‌నగర్ చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం!
Hyderabad: సరూర్‌నగర్ చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. శనివారం ఉదయం డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు.
మృతుడి వయస్సు సుమారు 40 సంవత్సరాలుగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి చేతులపై పలు పేర్లతో పచ్చబొట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి గుర్తింపు కోసం సరూర్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.




