Vanasthalipuram: హకీంపేట కమాన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి.. ఆచూకీ కోసం పోలీసుల విజ్ఞప్తి!
Vanasthalipuram: వనస్థలిపురం చింతలకుంట వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి ఎడమచేతిపై ‘మీనాక్షి’ పచ్చబొట్టు మృతదేహం ఉస్మానియా మార్చురీకి తరలింపు, ఆచూకీ కోసం పోలీసుల విజ్ఞప్తి.
Vanasthalipuram: హకీంపేట కమాన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి.. ఆచూకీ కోసం పోలీసుల విజ్ఞప్తి!
వనస్థలిపురం: వనస్థలిపురం చింతల కుంట సమీపంలోని ప్రలవి గార్డెన్ యూటర్న్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మంగళవారం మధ్యాహ్నం 3.20 గంటల సమయంలో యమహా బైక్ షోరూమ్ ముందు వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
మృతుడి వయస్సు 45 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. ఎత్తు సుమారు 5.5 అడుగులు, చామన ఛాయతో, కొద్దిగా బట్టతలతో ఉన్నాడు. మాసిన నలుపు రంగు ప్యాంట్, లేత నీలం రంగు చొక్కా ధరించి ఉన్నాడు. ఎడమ చేతిపై “మీనాక్షి” అనే పచ్చబొట్టు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
మృతదేహాన్ని ఉస్మానియా ప్రభుత్వ మార్చురీలో భద్రపరిచారు. ఈ ఘటనపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వ్యక్తి గురించి సమాచారం తెలిసిన వారు:
📞 8712662300
📞 8712662637
📞 8712662280
ఈ నంబర్లకు సమాచారం అందించాలని వనస్థలిపురం పోలీసులు కోరారు.




