Tandur: తాండూరులో ఏకలవ్య గురుకుల భవనాలను ప్రారంభించిన కిషన్ రెడ్డి!
Tandur: తాండూరు జిన్గుర్తిలో ఏకలవ్య ఫౌండేషన్ సాందీపని గురుకుల భవనాలను ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. విద్యార్థులతో కలిసి 'మన్ కీ బాత్' వీక్షణ.
Tandur:తాండూరులో ఏకలవ్య గురుకుల భవనాలను ప్రారంభించిన కిషన్ రెడ్డి!
Tandur: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జిన్గుర్తిలోని ఏకలవ్య ఫౌండేషన్ సాందీపని గురుకుల భవనాలకు కిషన్‌రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఏకలవ్య ఫౌండేషన్ సందీపని గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వీక్షించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బి. మనోహర్‌రెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోని ప్రతి రైతు సేంద్రియ వ్యవసాయంపై మరింత మక్కువ పెంచుకోవాలని, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యకరమైన వ్యవసాయం కోసం రైతులతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
నేటి ఆధునిక ప్రపంచంలో ఆరోగ్య రక్షణ కోసం సేంద్రియ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు.. ఎరువులు, రసాయనాల తో పండించిన పంటలతో అనారోగ్యం పాలవుతున్నామని ఇందుకు ఎలాంటి ఎరువులు వినియోగించకుండా పండించిన పంటలు ఆరోగ్య కరమన్నారు.




