Vikarabad: వికారాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పరిశీలన!
Vikarabad: వికారాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రూ.27 కోట్లతో స్టేషన్ అభివృద్ధి మరియు ప్రయాణికుల వసతులపై కీలక ప్రకటన.
Vikarabad: వికారాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పరిశీలన!
Vikarabad: ఆదివారం స్థానిక వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో కొనసాగుతున్న ఆధునీకరణ పనులను కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి పరిశీలించారు. స్టేషన్ అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, వికారాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణతో పాటు తెలంగాణలోనే 42 రైల్వే స్టేషన్ లు ఏకకాలంలో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి ఆధ్వర్యంలో కవచ్ టెక్నాలజీ ద్వారా ప్రమాదాల నివారణకు దోహదపడుతుందన్నారు.
బుల్లెట్ ట్రైన్ మన తెలంగాణకు వస్తే దేశంలోనే ప్రథమ స్థానంలో తెలంగాణ నిలుస్తుందన్నారు. బుల్లెట్ ట్రైన్ నడవడం ద్వారా ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా నివారించవచ్చ అన్నారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ 27 కోట్ల తో అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందన్నారు.
వికారాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రయాణికులు ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా ప్రయాణించగలుగుతారన్నారు. వికారాబాద్ స్టేషన్ లో ఫోర్ విల్లర్ పార్కింకింగ్ 50కి పెంచడం జరిగిందన్నారు.
టు వీలర్ పార్కింకింగ్ 150కి పెంచడం జరిగిందన్నారు. రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఎస్కలేటర్.2 లిఫ్టులు. మరియు క్యాంటీన్ దివ్యాంగులకు ఆధునిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు.
ఈ సంవత్సరం చివరి వరకు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. అండర్ బ్రిడ్జి సమస్యలు తొలగించడం కొరకు ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి తో కలిసి సెంట్రల్ రైల్వే మినిస్టర్ గారితో సమస్య పరిష్కరిస్తామన్నారు.
అతి తక్కువ కాలంలోనే నేషనల్ హైవే పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. ప్రయాణికులకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, తెలంగాణలో రైల్వే రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
వికారాబాద్ ప్రాంత అభివృద్ధికి రైల్వే కనెక్టివిటీ ఎంతో కీలకమని, ఆధునీకరణ పనులు పూర్తయిన తర్వాత ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందుతాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు..
ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, రైల్వే డివిజనల్ మేనేజర్ సికింద్రాబాద్ ఆర్. గోపాలకృష్ణ, అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, బిజెపి రాష్ట్ర సెల్ కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, రమేష్, కేయస్.రత్నం, ఎమ్మార్వో లక్ష్మీనారాయణ, అధికారులు, పాల్గొన్నారు.




