Gachibowli: ‘ఏక్ పేడ్ మా కే నామ్’లో కేంద్ర మంత్రి పిలుపు!

Gachibowli: గౌలిదొడ్డి గురుకుల పాఠశాలలో జరిగిన ‘స్వచ్ఛత పక్వాడ’ వేడుకల్లో కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 14 July 2026 10:00 PM IST
Gachibowli
X

Gachibowli: ‘ఏక్ పేడ్ మా కే నామ్’లో కేంద్ర మంత్రి పిలుపు!

గచ్చిబౌలి: స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 15 రోజుల పాటు నిర్వహిస్తున్న స్వచ్ఛత పక్వాడ ప్రత్యేక పారిశుధ్య, పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ఈ రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డిలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ బాలికల మరియు బాలుర పాఠశాలలో తెలంగాణ ఆయిల్

మార్కెటింగ్ కంపెనీల ఆధ్వర్యంలో స్వచ్ఛత పక్వాడ కార్యక్రమానికి కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ మరియు కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి, ప్రముఖ సినీ నటుడు శ్రీ సురేష్ గోపి గారు, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రవికుమార్ యాదవ్ గారు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ వి. గంగాధర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ‘మా కే నామ్ ఏక్ పేడ్’ కార్యక్రమంలో భాగంగా అతిథులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని సందేశమిచ్చారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, పచ్చదనం తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఇచ్చిన “ఏక్ పేడ్ మా కే నామ్” పిలుపు దేశవ్యాప్తంగా పర్యావరణ చైతన్యాన్ని పెంపొందిస్తోందని పేర్కొన్నారు. తల్లి గౌరవార్థం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించడం ద్వారా ప్రకృతికి మన వంతు సేవ చేయాలని సూచించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే విస్తృతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

స్వచ్ఛత పక్వాడ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన చిత్రలేఖన పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో బీపీసీఎల్ (భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) రాష్ట్ర హెడ్ (ఎల్‌పీజీ) శ్రీ నిరంజన్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ జనరల్ మేనేజర్ (రిటైల్) శ్రీ జగన్నాధ రావు గారు, హైదరాబాద్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (రిటైల్) శ్రీమతి షెఫాలీ సింగ్ గారు, ఐఓసీఎల్ (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & స్టేట్ హెడ్ శ్రీ పీయూష్ మిట్టల్ గారు, హెచ్‌పీసీఎల్ (హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) జోనల్ హెడ్ శ్రీ సుశీల్ కుమార్ గారు, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి కల్పన గారు, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story