Chaderghat: చాదర్‌ఘాట్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి!
Chaderghat: హైదరాబాద్ చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధి మూసా నగర్లో అనుమానాస్పద స్థితిలో భవనంపై నుంచి పడి ఉత్తరప్రదేశ్ వాసి మృతి చెందాడు.
Chaderghat: చాదర్‌ఘాట్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి!
Chaderghat: హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధి మూసా నగర్లో అనుమానాస్పద మృతి ఘటన చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అన్నే మియా అనే వ్యక్తి మూసా నగర్లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు.
రెండు అంతస్తుల భవనం పైనుంచి కిందపడినట్లు ప్రాథమిక సమాచారం. అయితే, అతను స్వయంగా దూకాడా? లేక ఎవరైనా తోసేశారా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు.
సమాచారం అందుకున్న చాదర్‌ఘాట్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణ పూర్తయిన తర్వాతే ఘటనకు సంబంధించిన అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.




