Uppal: నాచారం వెస్లీ స్కూల్‌లో కాంగ్రెస్ నేతల పుస్తకాల పంపిణీ

Uppal: నాచారంలోని వెస్లీ కో-ఎడ్యుకేషన్ హై స్కూల్ విద్యార్థులకు టీపీసీసీ లేబర్ సెల్ ఉపాధ్యక్షుడు వి.ఎస్. ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.

HARISH, TARNAKA
Published on: 22 Jun 2026 4:46 PM IST
Uppal
X

Uppal: నాచారం వెస్లీ స్కూల్‌లో కాంగ్రెస్ నేతల పుస్తకాల పంపిణీ

Uppal: నాచారం లోని అన్నపూర్ణ కాలనీలోని వెస్లీ కో-ఎడ్యుకేషన్ హై స్కూల్ విద్యార్థులకు నాచారం డివిజన్ నాయకుడు, టిపిసిసి లేబర్ సెల్ ఉపాధ్యక్షుడు విఎస్ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ కాంగ్రెస్ ఇన్‌చార్జి పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేసి వారికి విద్యాభ్యాసంలో మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు.

విద్యార్థుల విద్యాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అలాగే సమాజ సేవలో ముందుండి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న విఎస్. ప్రకాష్ రెడ్డి ని అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా విద్యార్థుల సంక్షేమం కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని పరమేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో హెచ్.ఆర్. మోహన్, జి. కృష్ణా రెడ్డి, బి. శ్రీకాంత్ గౌడ్, రామ్ రెడ్డి, రమేష్ గౌడ్, అశ్వత్థామ రెడ్డి, మహేష్ యాదవ్, కృష్ణ యాదవ్, సుధాకర్ రెడ్డి, నూతనకంటి రాజు, బాలరాజు, కాప్రా సాయి, నరసింగ్ రావు, సునీల్ రెడ్డి, రఘు, కృపాకర్, అజీమ్, కోటేష్, కోత వెంకటేష్ గౌడ్, ఖయ్యూం, ఫహీమ్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, యూసుఫ్, షాహిక్, రేవంత్, జాఫర్, మహిళా నాయకులు ఉమా, భావనా గౌడ్, భారతమ్మ, ఛాదు తో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story