Uppal: ఉప్పల్ కోర్టులో న్యాయవాదుల విధుల బహిష్కరణ

Uppal: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పల్ కోర్టు కాంప్లెక్స్‌లో న్యాయవాది మొయినుద్దీన్ హత్యకు నిరసనగా అడ్వొకేట్లు విధులను బహిష్కరించారు.

KARUNAKAR, UPPAL
Published on: 25 May 2026 8:37 PM IST
Uppal
X

Uppal: ఉప్పల్ కోర్టులో న్యాయవాదుల విధుల బహిష్కరణ

ఉప్పల్: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలోని ఉప్పల్ కోర్టు కాంప్లెక్స్‌లో న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్యకు నిరసనగా సోమవారం న్యాయవాదులు విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పలువురు అడ్వొకేట్లు పాల్గొని హత్య ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ నర్సింగోజు నరేష్ కుమార్ మాట్లాడుతూ, న్యాయవాదిని అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కోరారు. న్యాయవాదుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాఘవ రెడ్డి, సత్యనారాయణ, పవన్, శ్రీనివాస్, వెంకట్ రాములు, రాధాకృష్ణ, శ్రీకాంతుడు, ప్రసన్న, శేఖర్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story