Peerzadiguda: ఒకవైపు నీటి కష్టాలు.. మరోవైపు వృథా: జనం ఆగ్రహం!

Peerzadiguda: మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ పరిధిలోని ఉప్పల్ డిపో ఎదురుగా తాగునీటి పైప్‌లైన్ పగిలిపోవడంతో లక్షల లీటర్ల మంచినీరు వృథాగా రోడ్లపాలవుతోంది.

KARUNAKAR, UPPAL
Published on: 23 May 2026 7:42 AM IST
Peerzadiguda
X

Peerzadiguda: ఒకవైపు నీటి కష్టాలు.. మరోవైపు వృథా: జనం ఆగ్రహం!

ఉప్పల్: మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ పరిధిలోని ఉప్పల్ డిపో ఎదురుగా తాగునీటి పైప్‌లైన్ పగిలిపోవడంతో భారీగా మంచినీరు రోడ్లపాలవుతోంది. ఇప్పటికే తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, మంచినీరు వృథా అవుతుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై పైప్‌లైన్ లీకేజీ కారణంగా నీరు భారీగా చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డంతా నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. లక్షల లీటర్ల తాగునీరు వృథా అవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

ప్రజలకు సమయానికి తాగునీరు అందించాలని స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల వద్ద ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పరిస్థితిలో మార్పు లేదు. బోడుప్పల్ సర్కిల్ లోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నప్పటికీ అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సమస్యపై ప్రశ్నిస్తే కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం లేదు.. అందుకే పనులు ఆలస్యం అవుతున్నాయి, అంటూ అధికారులు సమాధానం చెబుతున్నారని స్థానికులు అంటున్నారు. వెంటనే పైప్‌ లైన్ మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story