Uppal: రామంతాపుర్‌లో రేషన్ బియ్యం అక్రమ రవాణా గుట్టురట్టు
Uppal: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా రేషన్ బియ్యం సేకరించి విక్రయిస్తున్న షేక్ దిల్సార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Uppal: రామంతాపుర్‌లో రేషన్ బియ్యం అక్రమ రవాణా గుట్టురట్టు
ఉప్పల్: పేదలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి, అధిక ధరకు విక్రయిస్తున్న వ్యక్తిని ఉప్పల్ పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 50 సంచుల్లో ఉన్న సుమారు 20 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
బియ్యం తరలిస్తున్న అశోక్ లేలాండ్ వాహనాన్ని సీజ్ చేశారు. ఉప్పల్ పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గస్తీ నిర్వహిస్తుండగా, ఉదయం 6 గంటల సమయంలో రామంతాపూర్‌లోని అరేనా టవర్స్ సమీపంలో అనుమానాస్పదంగా వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు.
వాహనంలో 50 సంచుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. వాహన డ్రైవర్‌ను విచారించగా కాటేదాన్ అరంగఢ్‌కు చెందిన షేక్ దిల్సార్ (25)గా గుర్తించారు. కుటుంబ అవసరాల కోసం సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొంతకాలంగా రామంతాపూర్ ప్రాంతంలోని ప్రజల నుంచి కిలో రూ.10 చొప్పున పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
అనంతరం అదే బియ్యాన్ని అవసరమైన వారికి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపాడు. పంచసాక్షుల సమక్షంలో పంచనామా నిర్వహించిన పోలీసులు 50 సంచుల్లోని సుమారు 20 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




