Uppal: ఉప్పల్ శిల్పారామంలో సాంప్రదాయ కళల సందడి

Uppal: ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక వేడుకలు అంబరాన్నంటాయి.

KARUNAKAR, UPPAL
Published on: 6 Jun 2026 9:05 PM IST
Uppal
X

Uppal: ఉప్పల్ శిల్పారామంలో సాంప్రదాయ కళల సందడి

ఉప్పల్: ఉప్పల్ మినీ శిల్పారామంలో నిర్వహిస్తున్న వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు కళాభిమానులను అలరిస్తున్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా శనివారం ప్రముఖ నృత్య గురువు శ్రీమతి చేతన రవిరాజ్ శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. గణేశ కృతి, శ్రీ విజ్ఞరాజం భజే, రారా వేణుగోపాల, స్వాగతం కృష్ణ, ముద్దుగారే యశోద, కృష్ణ శబ్దం, నర్తన గణపతి, శ్రీకృష్ణ లీల, నమ రామాయణం, సీత స్వయంవరం వంటి ఆధ్యాత్మిక, పౌరాణిక అంశాలను నృత్య రూపంలో ఆవిష్కరించి కళాకారులు విశేషంగా ఆకట్టుకున్నారు.

కిరణ్మయి, కీర్తి నాయుడు, సౌమ్య, ధరణి, యమునా, శ్రీహర్షిత, చర్విత, అన్వి, భువనైక, తనూజ తదితరులు తమ అభినయం, నృత్య నైపుణ్యంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ టీవీ నటి, నర్తకీమణి శ్రీమతి సుజాత (చంద్రవ్వ) ముఖ్య అతిథిగా హాజరై కళాకారులను అభినందించారు. సాంప్రదాయ కళలను భావితరాలకు చేరవేసే ఇటువంటి వేదికలు సమాజానికి ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన కళాభిమానులు కూచిపూడి నృత్య ప్రదర్శనలను ఆస్వాదిస్తూ కళాకారులకు ఘనంగా అభినందనలు తెలిపారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story