Kapra: కాప్రాలో ఎస్‌బీఆర్‌డబ్ల్యూఏ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
Kapra: కాప్రా పద్మశాలి టౌన్‌షిప్‌లో శ్రీ భావన ఋషి వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.
Kapra: కాప్రాలో ఎస్‌బీఆర్‌డబ్ల్యూఏ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
కాప్రా: కాప్రా పద్మశాలి టౌన్‌షిప్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ పార్క్‌లో నిర్వహించిన శ్రీ భావన ఋషి వెల్ఫేర్ అసోసియేషన్ (SBRWA) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షురాలు దీప యెములతో పాటు కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ అభివృద్ధి, సేవా కార్యక్రమాలు, ఐక్యతను పెంపొందించే దిశగా అసోసియేషన్ మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
సామాజిక సేవ, పరస్పర సహకారం, ఐక్యతతో సమాజాభివృద్ధికి కృషి చేసే సంస్థలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం చేపట్టే ప్రతి మంచి కార్యక్రమానికి తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సొసైటీ అధ్యక్షులు సీత ఆంజనేయులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సింగిరెడ్డి సోమ శేఖర్ రెడ్డి, సాయి జెన్ శేఖర్, మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి, రేగళ్ల సతీష్ రెడ్డి ,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు




