Mallapur: 174 మంది ప్రాణాలు కాపాడిన కెప్టెన్‌కు ఎమ్మెల్యే అభినందనలు!

Mallapur: మల్లాపూర్‌లో 174 మంది ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను అభినందించి, త్వరగా కోలుకోవాలని ఆంజనేయస్వామిని ప్రార్థించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.

HARISH, TARNAKA
Published on: 3 Oct 2026 10:33 AM IST
Mallapur
X

Mallapur: 174 మంది ప్రాణాలు కాపాడిన కెప్టెన్‌కు ఎమ్మెల్యే అభినందనలు!

Mallapur: కీలక సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి 174 మంది ప్రాణాలను కాపాడేందుకు కృషి చేసిన కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ను ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అభినందించారు. మల్లాపూర్‌ ఎలిఫెంట్‌ సర్కిల్‌ సమీపంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మల్లాపూర్‌ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ ధైర్యసాహసాలు, విధినిబద్ధత, సమయస్ఫూర్తిని ఎమ్మెల్యే కొనియాడారు. ఆపద సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రాణాలను కాపాడేందుకు చేసిన ప్రయత్నం అభినందనీయమన్నారు. కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ దేవేందర్‌రెడ్డితో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA