Kapra: కాప్రాలో చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Kapra: కాప్రా వంపుగూడలో చలివేంద్రాన్ని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. వేసవిలో ప్రజలకు తాగునీటి సౌకర్యం.

ASHOK, KAPRA
Published on: 21 April 2026 1:01 PM IST
Kapra
X

Kapra

Kapra: కాప్రా సర్కిల్ పరిధిలోని వంపుగూడ కాలనీ కమ్యూనిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. రాయగట్ల కృష్ణ కిట్టు ఆధ్వర్యంలో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం అత్యవసరమని తెలిపారు. చలివేంద్రం ద్వారా పాదచారులు, కార్మికులు, స్థానిక ప్రజలు ఉపశమనం పొందుతారని పేర్కొన్నారు.

సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు నవీన్ గౌడ్, భద్రుద్దీన్ మల్లారెడ్డి, గణేష్ కృష్ణ గౌడ్ తదితరులు, కాలనీ వాసులు, యువకులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story