Uppal: జేమ్మిగడ్డలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
Uppal: కాప్రా జేమ్మిగడ్డలో శ్రీ రాధాకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ప్రముఖులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
Uppal: జేమ్మిగడ్డలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
ఉప్పల్: శ్రీకృష్ణుడి జీవితం, బోధనలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ధర్మాన్ని కాపాడుతూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుడి బోధనలను ఆచరించాలని సూచించారు.
కాప్రా సర్కిల్ డాక్టర్ ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలోని జేమ్మిగడ్డలో శ్రీ రాధాకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, బొంతు శ్రీదేవి యాదవ్, పావని మణిపాల్ రెడ్డి, బిజెపి అధికార ప్రతినిధి, మాజీ ఎంపీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీజేపీ నాయకుడు రజినీకాంత్‌రెడ్డి తదితరులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. శ్రీకృష్ణుడి బోధనలు నేటి సమాజానికి ఎంతో అవసరమని మాజీ కార్పొరేటర్లు పేర్కొన్నారు. ధర్మం, సత్యం, న్యాయం కోసం పోరాడే స్ఫూర్తిని శ్రీకృష్ణుడి జీవితం అందిస్తుందని తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ఏటా నిర్వహించడం ద్వారా యువతలో మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెరుగుతుందని అన్నారు.
సంఘం అభివృద్ధికి, స్థానిక ప్రజల సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. శ్రీకృష్ణుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించిన పూజలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. వేడుకలను విజయవంతం చేసిన శ్రీ రాధాకృష్ణ యాదవ సంఘం సభ్యులను పలువురు ప్రముఖులు అభినందించారు.
జైజవాన్ కాలనీ తిరుమలయ్య యాదవ్ సహకారంతో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాధా కృష్ణ యాదవ సంఘం అధ్యక్షులు పటేల్ గోపాల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఎ.వెంకటేష్ యాదవ్, కోశాధికారి పటేల్ శివశంకర్ యాదవ్, ఎన్.రమేష్ యాదవ్, పటేల్ కనకయ్య యాదవ్, పరమేష్ యాదవ్, నరసప్ప యాదవ్, రాములు యాదవ్, అశోక్ యాదవ్, వెంకటయ్య యాదవ్ కనకయ్య యాదవ్,




