Nacharam: నాచారంలో రూ.37 కోట్లతో పెద్ద చెరువు సుందరీకరణ.. పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
Nacharam: నాచారం హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువు వద్ద రూ.37 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పునరుద్ధరణ, సుందరీకరణ పనులను స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఘనంగా ప్రారంభించారు.
Nacharam: నాచారంలో రూ.37 కోట్లతో పెద్ద చెరువు సుందరీకరణ.. పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
నాచారం: నాచారం హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువు వద్ద 37కోట్ల రూపాయలతో చేపట్టిన పునరుద్ధరణ, సుందరీకరణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బిఆర్ఎస్ నేత సాయిజెన్ శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని చెరువు పునరుద్ధరణ పనులకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాచారం ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే దిశగా పెద్ద చెరువును సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 37 కోట్ల రూపాయల ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. చెరువు పరిసరాలను పచ్చదనంతో అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహ్లాదకరంగా గడిపేలా వాకింగ్ ట్రాక్‌లు, పార్కులు, లైటింగ్, విశ్రాంతి ప్రదేశాలు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ పనులు పూర్తయిన తర్వాత హెచ్ఎంటి పెద్ద చెరువు నగరంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. స్థానిక ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందన్నారు. నాచారంలోని పటేల్ కుంట చెరువును కూడా సుందరీకరణ కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నేతలు, కాలనీ సంఘాల అధ్యక్షులు, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.




