Uppal: ఉప్పల్‌లో ఘనంగా పోచమ్మ, నల్ల పోచమ్మ బోనాల వేడుకలు
Uppal: ఉప్పల్‌లో అంగరంగ వైభవంగా పోచమ్మ, నల్ల పోచమ్మ బోనాల వేడుకలు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన మందుముల పరమేశ్వర్ రెడ్డి, రజిత పరమేశ్వర్ రెడ్డి.
Uppal: ఉప్పల్‌లో ఘనంగా పోచమ్మ, నల్ల పోచమ్మ బోనాల వేడుకలు
ఉప్పల్: ఉప్పల్‌లో ఆదివారం బోనాల పండుగ సందడి నెలకొంది. అమ్మవారి నామస్మరణలతో ఆలయాలు మార్మోగగా, భక్తుల రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. బోనాల పండుగను పురస్కరించుకుని ఉప్పల్‌లోని శ్రీ పోచమ్మ, శ్రీ నల్ల పోచమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
బోనాల సందర్భంగా ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకునేలా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వ సహకారం
బోనాల ఏర్పాట్ల కోసం ఆయా ఆలయ కమిటీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని వారు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని ఆలయాలకు అవసరమైన నిధులు అందేలా కృషి చేశామని చెప్పారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




