Uppal: ఉప్పల్ లో డ్రోన్ కెమెరా నిఘతో బైక్ రేసర్లపై ఉక్కుపాదం
Uppal: ఉప్పల్ లో బైక్ రేసింగ్ చేస్తున్న యువకులపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టిన పోలీసులు. ప్రమాదకరంగా స్టంట్లు చేస్తున్న వారిని పట్టుకుని కేసు నమోదు.
Uppal: ఉప్పల్ లో డ్రోన్ కెమెరా నిఘతో బైక్ రేసర్లపై ఉక్కుపాదం
ఉప్పల్: రోడ్లపై బైక్ రేసింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న యువకులపై ఉప్పల్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ నిర్వహించిన డ్రోన్ పెట్రోలింగ్ లో బైక్ రేసర్లు పోలీసులకు చిక్కారు.
శనివారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో ఉప్పల్ బాగాయత్‌లోని శ్రీ చైతన్య కాలేజీ వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో కొందరు యువకులు ప్రమాదకరంగా బైక్ రేసింగ్ నిర్వహిస్తున్నట్లు డ్రోన్ నిఘా ద్వారా గుర్తించారు.
వెంటనే ఉప్పల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రేసింగ్‌లో పాల్గొన్న వారిని గుర్తించి, పట్టుకొని వారిపై కేసు నమోదు చేశారు. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే బైక్ రేసింగ్‌లు, స్టంట్లు, నిర్లక్ష్య డ్రైవింగ్‌లపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
రోడ్లపై రేసింగ్‌లు నిర్వహించి ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.




