Uppal: కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు సిద్ధమైన మహిళను కాపాడిన ఉప్పల్ పోలీసులు

Uppal: కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు సిద్ధమైన మహిళను కాపాడిన ఉప్పల్ పోలీసులు.

KARUNAKAR, UPPAL
Published on: 21 Jun 2026 7:32 AM IST
Uppal
X

Uppal: కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు సిద్ధమైన మహిళను కాపాడిన ఉప్పల్ పోలీసులు

ఉప్పల్: కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయంతో వెళ్లిన ఓ మహిళను ఉప్పల్ పోలీసులు సమయస్ఫూర్తితో స్పందించి కాపాడారు. వారి అప్రమత్తతతో ఒక కుటుంబంలో విషాదం తప్పింది.

నాగోల్‌ లోని మమతా నగర్‌ కు చెందిన బోడుగ స్వాతి (56) శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఉప్పల్ బాగాయత్ ప్రాంతంలో ఒంటరిగా సంచరిస్తుండగా, విధుల్లో ఉన్న ఉప్పల్ బ్లూ కోల్ట్స్ కానిస్టేబుళ్లు మోహన్ చౌహన్, శివకృష్ణ ఆమెను గమనించారు.

అనుమానం రావడంతో ఆమెను ఆపి మాట్లాడగా, ఇంట్లో జరిగిన గొడవల కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడానికి మూసీ నది వైపు వెళ్తున్నట్లు తెలిపింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించి, ఆత్మస్థైర్యం నిలిపారు.

జీవితంపై నమ్మకం కల్పిస్తూ కుటుంబ సభ్యులతో మాట్లాడేలా చేశారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించి సంఘటనా స్థలానికి రప్పించి, మహిళను సురక్షితంగా వారి సంరక్షణలో అప్పగించారు.

సమయానికి స్పందించి ఓ మహిళ ప్రాణాలను కాపాడిన బ్లూ కోల్ట్స్ సిబ్బంది మోహన్ చౌహన్, శివకృష్ణలను స్థానికులు అభినందించారు. ప్రజల భద్రతతో పాటు వారి ప్రాణాలను కాపాడడంలోనూ ఉప్పల్ పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారని ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story