Uppal: గొడవపడి ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఏమైందోనని ఆందోళన!

Uppal: ఉప్పల్ ఆదర్శ్ నగర్ కాలనీలో గృహిణి సారంగా జమున అదృశ్యం.

KARUNAKAR, UPPAL
Published on: 9 May 2026 11:32 AM IST
Uppal
X

Uppal: గొడవపడి ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఏమైందోనని ఆందోళన!

ఉప్పల్: కుటుంబ కలహాల కారణంగా సారంగా జమున అనే గృహిణి ఇంటి నుంచి వెళ్లిపోయి అదృశ్యం అయిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహిళ ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ ఆదర్శ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న సారంగా జమున (36) తన భర్త రాముడు, పిల్లలతో కలిసి నివసిస్తోంది. కుటుంబ విషయాల్లో గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈనెల మూడవ తేదీన భర్త, పిల్లలతో జరిగిన గొడవ అనంతరం మధ్యాహ్నం సుమారు రెండున్నర గంటల సమయంలో జమున ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది.

అనంతరం తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువులు, పరిసర ప్రాంతాలు, తెలిసిన చోట్ల వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో భర్త రాముడు మరుసటి రోజున ఉప్పల్ పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోటోలో కనిపిస్తున్న జమున అనే మహిళ ఎక్కడైనా కనిపించినా, సమాచారం తెలిసినా వెంటనే ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలను కోరారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story